TG: ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం 11 గంటలకు ఆయన పార్లమెంట్‌కు వెళ్లనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఆయనతో పాటు ఉంటారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలిసే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ వ్యవహారాలపై చర్చించిన అనంతరం, మధ్యాహ్నం ఆయన తిరిగి HYDకు బయలుదేరుతారు.