»Sugar Exports Ban On Sugar Exports Indias Key Decision
Sugar Exports: చక్కెర ఎగుమతులపై నిషేధం..భారత్ కీలక నిర్ణయం!
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది చెరకు దిగుబడి తగ్గింది. దీంతో రాబోయే నెలల్లో చక్కెర ధరలు పెరగనున్నాయి. అందుకే ప్రజలపై భారం పడకుండా చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం విధించనుంది.
నిత్యావసరాల ధరల తగ్గించేందుకు కేంద్రం ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ధరల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ధరలకు చెక్ పెట్టేందుకు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే తదుపరి సీజన్లో చక్కెర ఎగుమతులను (sugar exports) భారత్ నిషేధించనున్నట్లు తెలిపింది. వర్షపాతం తగినంత లేకపోవడంతో ఈసారి చెరకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని, దాని వల్ల ధరలకు రెక్కలు వస్తాయని కేంద్రం అంచనా వేసింది.