VKB: పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దేముల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత యాదవ్ తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వివిధ రకాల ప్రత్యేక వైద్యులు రానున్నారని చెప్పారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.