KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. గత నెల 13 నుంచి మంగళవారం వరకు రామయ్య క్షేత్రాన్ని దర్శించిన భక్తులు కానుకలను సమర్పించారు. రంగ, ముఖ మండపం, భక్త సంజీవరాయస్వామి ఆలయంలో హుండీలను తితిదే అధికారులు తెరిచారు. సిబ్బంది, శ్రీవారి సేవకులు మదింపు చేయగా రూ. 7,72,502 వచ్చినట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు.