BHNG: ఆలేరు మండలంలో అర్హులైన పేదలకు తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించి పట్టాలు ఇవ్వాలని CPI మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావుకు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా CPI జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. కొలనుపాకలో సర్వే నంబర్ 8 లోని ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకుని ఉన్నారని తెలిపారు.