GDWL: వడ్డేపల్లిలో మున్సిపల్ కమిషనర్ రాజయ్య పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు వేగవంతమయ్యాయి. 99 రోజుల కార్యాచరణలో భాగంగా 12వ రోజు 4వ వార్డులో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టి, వ్యర్థాలను ఎప్పటికప్పుడు పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మున్సిపాలిటీ పరిధిలో 72.99 శాతం ఆస్తి పన్ను వసూళ్లు అయినట్లు తెలిపారు.