తూ.గో: మాతృశ్రీ నూకాలమ్మ జాతర సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కొత్తపల్లి, రామరాజుపేట గ్రామాలకు చెందిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కోరుకొండ సీఐ మూర్తి మంగళవారం తెలిపారు. జాతరలో ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఈ అరెస్టులు చేసినట్లు పేర్కొన్నారు.