మేషం:
ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. ఉద్యోగంలో అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆంజనేయస్వామి నామాన్ని పఠించండి.
వృషభం:
బాధ్యతలు పెరుగుతాయి. ఒత్తిడి ఎక్కువవుతుంది. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లలకు అనారోగ్యం చేస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఆదాయం సానుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవిని స్మరించండి.
మిథునం:
వృత్తి, ఉద్యోగాలలో చికాకు కలుగుతుంది. ప్రయాణాలు చేస్తారు. ఆలయాలు దర్శిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలుగుతాయి. ఉద్యోగం మారడానికి ఇదే మంచి సమయం. ఆర్థికంగా బలపడతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. కాళికాదేవి ఆలయాన్ని దర్శించుకోండి.
కర్కాటకం:
దూరపు బంధువులు దగ్గరవుతారు. పాత మిత్రులు కలుస్తారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శన చేస్తారు. ఉద్యోగాలలో ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది. శివాలయం దర్శించండి.
సింహం:
ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆర్థికపరంగా ఒత్తిడి కలుగుతుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. మీ నుంచి సాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. బంధువుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఒకరిద్దరికి అన్నదానం చేస్తే మంచిది.
కన్య:
ముఖ్యమైనవారితో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు తలనొప్పులు తెచ్చిపెడతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. గణేశుడి దేవాలయం దర్శించండి.
తుల:
శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలను అందుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మంచి కలిగిస్తాయి. అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వింటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. అమ్మవారి గుడిని దర్శించండి.
వృశ్చికం:
అనుకున్న పనులలో కొన్ని అవాంతరాలు, అవరోధాలు ఏర్పడతాయి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. కుటుంబ విషయాల్లో నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆలయాలు దర్శిస్తారు. వృత్తి, వ్యాపా రాల్లో ఆశించినంతగా లాభాలు పొందరు. ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతాయి. సుబ్రమణ్యస్వామిని దర్శించండి.
ధనుస్సు :
శత్రు, రోగ, రుణ సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులతో చికాకులు ఏర్పడకుండా చూసుకోండి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఏది తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి తప్పదు. వెంకటేశ్వరస్వామి నామాలు జపించండి.
మకరం:
సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఆర్థిక పరంగా బావుంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడి తప్పదు. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. స్నేహితులకు అప్పు ఇవ్వొద్దు. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి.
కుంభం:
గృహ, వాహనాలు పొందే ప్రయత్నం చేస్తారు. రాజకీయ ప్రముఖులతో సహవాసం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలలో శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. సహోద్యోగులకు సహకారం అందిస్తారు. ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. రామాలయం దర్శించండి.
మీనం :
తొందరపడి ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. దైవకార్యాల్లో పాల్గొని ఆలయ దర్శనాలు చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. బంధువుల నుంచి అవమానాలను ఎదుర్కొంటారు. కులదైవాన్ని పూజించండి.