PDPL: రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించాలన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యా రంగానికి పెద్దపీట వేయాలని కోరారు.