MHBD: గ్రామపంచాయతీ కార్మికులు తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం తొర్రూరు మండల వ్యాప్తంగా పలువురు కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు స్టేషన్ ఆవరణలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.