JGL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మెట్పల్లి పట్టణంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదని బీజేపీ నాయకులు విమర్శించారు. హామీలను వెంటనే అమలు చేయాలని వారు తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.