KNR: కిసాన్ నగర్లోని ప్రభుత్వ వృద్ధుల, దివ్యాంగుల ఆశ్రమాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వృద్ధుల నివాస గదులను, వంటగది, తాగునీటి వసతి, టాయిలెట్స్ పరిశీలించారు. గీజర్, శుద్ధ జల యంత్రాల పనితీరును పరిశీలించారు. అనంతరం వృద్ధులు, దివ్యాంగులతో ముచ్చటించారు. భోజనం ఎలా ఉంటుందని, రుచిగా వండుతున్నారని తెలుసుకున్నారు.