ఏపీ EAPCET-2026 దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకూ పొడిగించినట్లు సెట్ కన్వీనర్ మోహనరావు తెలిపారు. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు, రూ.2 వేల రుసుముతో ఏప్రిల్ 1 వరకు, రూ.4 వేల రుసుముతో ఏప్రిల్ 6 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 10 వరకు గడువు ఉందని వివరించారు. తప్పుల సవరణకు ఏప్రిల్ 11 నుంచి 13 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.