HNK: శాయంపేటలో జనగణనపై పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలకు అవగాహన సదస్సును నిర్వహించారు. తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో ఫణిచంద్ర హాజరై మాట్లాడుతూ.. మ్యాపింగ్ చేయడంలో ఒక్క ఇంటిని కూడా మర్చిపోకూడదని, మండల వ్యాప్తంగా ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేసి జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. MEO బిక్షపతి, ఎంపీవో రంజిత్ కుమార్, తదితరులు ఉన్నారు.