SRCL: కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన వృద్ధురాలు మాదాసు నరసవ్వ బ్రతికి ఉండగానే అధికారులు రికార్డులలో మరణించినట్టు నమోదు చేశారు. అధికారులకు పలమార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని వృద్ధురాలు వాపోయారు. కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే రికార్డుల్లో మరణించినట్టు ఉండటం వల్ల పెన్షన్ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.