VZM: నవోదయ ప్రవేశ పరీక్షలో గుర్ల మండలం కొండగండ్రేడు గ్రామానికి చెందిన విద్యార్థి బోడసింగి పుణీత్ కుమార్ ప్రతిభ చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 100కు 93.75 మార్కులు సాధించి నవోదయ పాఠశాలలో ప్రవేశానికి అర్హత సాధించాడు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి ఉత్తమ ఫలితం సాధించడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.