అసోంలోని అధికార NDA కూటమికి సంబంధించి సీట్ల పంపకంపై సీఎం హిమంత బిశ్వ శర్మ క్లారిటీ ఇచ్చారు. NDA కూటమిలో బీజేపీ 89 సీట్లలో పోటీ చేస్తుందని శర్మ తెలిపారు. అలాగే AGP (అసోం గణ పరిషద్) పార్టీ 26 సీట్లలో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) 11 సీట్లలో పోటీ చేస్తుందని వెల్లడించారు. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లున్నాయి.