GDWL: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జోగుళాంబ జోన్ (Zone-Ull) అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం 40 పతకాలు సాధించి జోన్ సత్తా చాటింది. మంగళవారం మహబూబ్ నగర్లో విజేతలను జోన్ డీఐజీ ఎల్.ఎస్.చౌహన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు ఉమ్మడి జిల్లా ఎస్పీలు, పోలీస్ అధికారులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.