AP: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలో రేపు YCP నిర్వహించే ఇఫ్తార్ విందులో మాజీ సీఎం జగన్ పాల్గొననున్నారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు. రంజాన్ మాసం సోదరభావం, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ఈ ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.