TG: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 750 మంది పేదల ఇళ్లు కూల్చేసి.. 411 మందికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వడాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. మిగతా బాధితుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. తమకు అన్యాయం జరిగిందనే భావన వారిలో నెలకొందని.. ప్రతి బాధితుడికి న్యాయం జరగాలనే లక్ష్యంగా వెలుగుమట్ల బాధితుల కోసం నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.