TPT: దివ్యాంగులకు ఉగాది కానుకగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని బుధవారం ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు. 40%పైగా వైకల్యం ఉన్నవారికి అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం లభిస్తుంది. సహాయకులకు 50% రాయితీ ఉంటుంది. 4 వర్గాల నుంచి 21 వర్గాల దివ్యాంగులకు పథకం విస్తరించారు.