AP: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు గాను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. సీఎం CSO కె.మధుసూదన్ మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. సీఎం కాన్వాయ్ డ్రైవర్ AVS గిరిబాబు ఉత్తమ సేవా పతకాన్ని అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉగాది సందర్భంగా ఈ పతకాలను ప్రకటిస్తుంది.