KMR: రుణాలు ఇప్పిస్తామని ముందస్తుగానే వడ్డీ వసూలు చేస్తున్న వీక్లీ ఫైనాన్స్ ముఠా సభ్యుల్లో ఇద్దరిని కామారెడ్డి పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఈ మేరకు మంగళవారం పోలీసులు వివరాలను వెల్లడించారు. సాధారణ ప్రజలు, రైతులు, ఆటో డ్రైవర్ల అవసరాలను ఆసరాగా చేసుకుని ఫైనాన్స్ ఇప్పిస్తామని నమ్మబలికి వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు.