AP: నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(NUDA) కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన దాడుల కొనసాగింపుగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అక్కడ మంజూరైన భవన అనుమతులు, ‘నుడా’లో ఇచ్చిన పర్మిషన్లకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.