ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గంలోని ఎంపీడీవోలతో సమావేశమయ్యారు. మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆయన వారితో సమీక్షించారు. వారికి అభివృద్ధి పనులపై పలు రకాల సూచనలు చేశారు. ఏ ఏ గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందో ఆ గ్రామాలపై దృష్టి సారించాలని ఎంపీడీవోలకి సూచించారు.