AKP: చీడికాడ మండలం దండిసురవరం గ్రామంలో మంగళవారం గంగాదేవి గావు పండగను ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు.