SRD: డ్రగ్స్‌పై పోరాడి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని సీఐ వెంకట్ రెడ్డి మంగళవారం తెలిపారు. కల్హేర్, కంగ్టి, సిర్గాపూర్ మండల ప్రజలకు ఆయన ఇవాళ పలు సూచనలు ఇచ్చారు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాల పట్ల తెలుసుకోవాలని చెప్పారు. భావితరం వాటికి బానిస కాకుండా చూడాలన్నారు. డ్రగ్స్ ముట్టుకునే ముందు ఒక్కసారి ఆలోచించి జీవితాన్ని జయించాలని సూచించారు.