KMM: జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఖమ్మం జిల్లా మీడియా కన్వీనర్ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగుతున్నాయని తెలిపారు. జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల భూమిని సొసైటీలో సభ్యత్వం కలిగిన 320 మంది జర్నలిస్టులకు 200 గజాల చొప్పున పంపిణి చేయాలన్నారు.