సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకరమైన కామెంట్లపై నటి రేణుదేశాయ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనపై దూషణలు చేస్తున్న నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.