NGKL : వెల్దండ మండలం రాఘాయిపల్లి గేట్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ రెడ్డి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన ఆయన కల్వకుర్తిలో నివాసం ఉంటున్నారు. కారు, బొలెరో ఢీకొన్న సంఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.