బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన సోదరుడు ఈషాన్ రోషన్తో కలిసి నిర్మాణ రంగంలో సరికొత్త అడుగులు వేస్తున్నాడు. వీరిద్దరి కలయికలో ‘మెస్’ అనే క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. హృతిక్ తన సొంత బ్యానర్ ‘HRX ఫిలిమ్స్’ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కానుంది. అన్నదమ్ముల ఈ కొత్త ప్రయత్నంపై ఆసక్తి నెలకొంది.