KMR: మద్నూర్ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం పనులను మంగళవారం సర్పంచ్ ఉష సంతోష్ ప్రారంభించారు. గ్రామంలో రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే గ్రామంలో నీటి సమస్య పరిష్కారం కోసం పది బోర్లు వేసినట్లు పేర్కొన్నారు.