GDWL: గద్వాల మండలం గోనుపాడు శివారులో పంట పొలాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల వివరాలు, సాగు చేస్తున్న పంటల నమోదులో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.