MHBD: ఈనెల 27న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి వెళ్లే భక్తుల కోసం తొర్రూరు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు తొర్రూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పద్మావతి తెలిపారు. పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.280 చార్జీలు నిర్ణయించామని, ఈ బస్సు ఉదయం నాలుగు గంటలకు బయలుదేరి, కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు.