AP: తిరుమలలో అసాంఘీక కార్యకలాపాలు పెరిగాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ‘బీఆర్ నాయుడు ఛైర్మన్ అయ్యాక టీటీడీ విశిష్టత దెబ్బతింది. రూ.300 టికెట్లు ఇచ్చి ఆకు రౌడీలను పోషిస్తున్నారు. నిరసన తెలిపిన మహిళలపై దాడులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అసాంఘీక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.