ASF: తిర్యాని మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ హరిత సందర్శించారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలు, రిజిస్టర్లను తనిఖీ చేసిన ఆమె, రోగులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం 14 ఏళ్ల వయస్సు పిల్లల కోసం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, టీకా ప్రక్రియపై పలు సూచనలు చేసారు.