NRML: ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఆశా వర్కర్లు కదం తొక్కారు. పారితోషికం స్థానంలో వేతనాలు చెల్లించాలని, పని భారం తగ్గించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సోమవారం నుంచి మంగళవారం వరకు ఆర్డీఓ కార్యాలయం ఎదుట 48 గంటల నిరసన చేపట్టారు.