ASF: జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఆసిఫాబాద్ లో 38.7°C, కెరమెరిలో 38.2, పెంచికల్ పెట్ 37.8, తీర్యాణి 37.2, రెబ్బెన 37.2, సిర్పూర్ 36.9, కాగజ్ నగర్ 36.0, వాంకిడి 35.9, దహెగాం 35.9, చింతలమనేపల్లి 35.4°Cలుగా నమోదయ్యాయి. ఎండ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.