శర్వానంద్, అభిలాష్ రెడ్డి కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’ ఏప్రిల్ 3న విడుదల కానుంది. దీనిపై సంగీత దర్శకుడు గిబ్రాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘సాహో’ తర్వాత తనకు ఇది పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ అవుతుందని, కథలోని ఎమోషన్స్ తనను ఆకట్టుకున్నాయని తెలిపాడు. సినిమాలో 8 పాటలు ఉండగా, ఒక పూర్తి పాటతో పాటు మిగిలినవి మాంటేజ్ సాంగ్స్ అని పేర్కొన్నాడు.