ప్రకాశం: రహదారులపై ఆటోలు నడిపేవారు ఆర్టీవో నిబంధనలను పాటించాలని సింగరాయకొండ సీఐ హజరత్తయ్య అన్నారు. మంగళవారం ఆటో డ్రైవర్లకు రోడ్డు నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, ఆటో నడిపేవారు యూనిఫామ్ కచ్చితంగా ధరించాలి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని సూచించారు.