వెన్నునొప్పి, కండరాల ఒత్తిడిని తగ్గించడానికి ‘సాల్ట్ వాటర్ బాత్’ (ఉప్పునీటి స్నానం) అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, మనం వాడాల్సింది సాధారణ వంట ఉప్పు కాదు ‘ఎప్సమ్ సాల్ట్’. ఈ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్తో తయారవుతుంది. గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దెబ్బతిన్న కణజాలం త్వరగా కోలుకుంటుంది. శరీరంపై గురుత్వాకర్షణ ప్రభావం తగ్గుతుంది.