మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో మంగళవారం హెచ్పివి (HPV) వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో దోహదపడుతుందని, ఆడబిడ్డల భవిష్యత్తుకు ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని పేర్కొన్నారు.