SDPT: కొత్తగా పట్టాదార్ పాస్బుక్లు పొందిన రైతులు ‘రైతు భరోసా’కు దరఖాస్తు చేసుకోవాలని ఏఈవో పవన్ సూచించారు. అర్హులై ఉండి ఇప్పటికీ పథకం అందని వారు, బ్యాంక్ ఖాతా సమస్యలున్న వారు కూడా ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారం, పాస్బుక్, ఆధార్, బ్యాంక్ వివరాలతో ఏఈవోను సంప్రదించాలని కోరారు. గడువులోగా నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.