TPT: అవినీతికి కేరాఫ్ టీడీపీ అని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సూళ్లూరుపేట అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, ఆమె తండ్రి, ఎమ్మెల్యే సోదరులు కలిసి వసూళ్ల మాఫియాగా ఏర్పడి నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.