బాహుబలి తర్వాత సీక్వెల్ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒక్క పార్ట్‌లో కథను చెప్పలేకపోతే.. రెండో పార్ట్‌ను ప్లాన్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్స్. ఇప్పటికే సీక్వెల్ సినిమాలు భారీ విజయాలు అందుకుంటున్నాయి. ఇక ఇప్పుడు విజయ్ నటిస్తున్న 'లియో' సినిమా కూడా రెండు భాగాలు అని తెలుస్తోంది.
టాలెంటెడ్ డైరెక్టర్ లోకష్ కనగారాజ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్‌తో ‘లియో’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. విక్రమ్ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ తర్వాత లోకేష్ నుంచి వస్తున్న సినిమా కావడం ఒకటైతే.. మాస్టర్ తర్వాత విజయ్‌తో చేస్తున్న సినిమా కావడంతో.. లియో పై భారీ అంచనాలున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే ఖైదీ, విక్రమ్ సినిమాలను తన యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించాడు లోకేష్. కానీ ‘లియో’ సినిమాను ‘మాస్టర్’ సినిమాలాగే తన యూనివర్స్‌లోకి తీసుకురావడం లేదు.
అందుకే లియోని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి, కేజీఎఫ్, పొన్నియన్ సెల్వన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. త్వరలోనే మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’ కూడా రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే పుష్ప2 కూడా తెరకెక్కుతోంది. బాహుబలి తర్వాత వచ్చిన సీక్వెల్ సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కథ పరంగా.. లియో సినిమాను లోకేష్ కనకరాజ్ రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు తీసుకోచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమా కూడా లోకేష్ మార్క్ టచ్‌తోనే మాఫియా, డ్రగ్స్ చుట్టూ తిరిగే కథతో లియో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఖైదీ 2 లేదా విక్రమ్ 2 ప్లానింగ్‌లో ఉన్నాడు లోకేష్. అలాగో ప్రభాస్, రజనీ కాంత్తోను సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలు కూడా లోకేష్ యూనివర్స్‌లో భాగంగా రానున్నాయి.