గుంటూరు: నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు ప్రజలు 0863-2224202 నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా కమిషనర్ పులి శ్రీనివాసులుకు తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమం అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కూడా ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.