SRD: కాంగ్రెస్ ప్రజా పాలనతోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా అన్నారు.గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి ఇప్ప పెంటారెడ్డికి మద్దతుగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.