NZB: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీ విద్యార్థులకు విద్యా ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ జాక్ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో,విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు.