GDWL: అలంపూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలంటే, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం అయిజ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన నియోజకవర్గంలో రెండో విడత ఎన్నికలు జరిగే అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో మొత్తం 14 జీపీలు ఏకగ్రీవం అయ్యిందన్నారు.