ADB: దేశంలోని ప్రజానీకం శాంతియుతంగా మెలగాలని ఆదివారం నార్నూర్ మండలంలోని గుండాల గోండుగూడ గ్రామ ఆదివాసీలు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, చిన్నారులు, పెద్దలు కలిసి గ్రామ ప్రధాన రహదారి మూలపై కొలువుదీరిన పోచమ్మ తల్లి మందిరం వద్ద ప్రత్యేక వంటలు చేసి నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మల్కుపటేల్, జంగు, రాజు, అర్జు పాల్గొన్నారు.